అన్నమయ్య ప్రాస ప్రయాసలతో సృష్టించబడ్డ సరికొత్త అఛ్చతెలుగు పదాలు అనేకాలు.
“ఎక్కువ, తక్కువలు” అనేదానికి బదులు “ హెచ్చు కుందులు “
“ అవును కాదు “ అనేదానికి బదులుగా “ అవు కాము “
వెలుగు “ అనేదానికి బదులుగా “ పగటు “. అని , ఎన్నో సందర్భానికి తగ్గట్లు ఫిట్టింగ్ ఇస్తారు అన్నమయ్య. ఆయన సాహితీ సౌభాగ్యమంతా ఇంతా గాదు . ఎక్కడ ఏ పదప్రయోగము సమంజసమో,అక్కడ ఆ పదము వాడి, భావార్ధము పెల్లుబికించగల అన్నమయ్య తెలుగుభాషా శిల్పకళా సౌలభ్యమునకు , యింకెవ్వరూ పోటీ నిలవలేరు.
అన్నమయ్య, “హరి “ సూర్య వంశజుడు , అనేందుకు బదులు, “” మేకుల శ్రీ హరి “ అని అంటారు.
సూర్యుని , ఒకే ఒక్క అక్షరంతో “ మే “ అని సంబోధించారు.
“ శ్రీ కాంతుడైనట్టి శ్రీ వేంకటేశ్వరుని చేకొంటే సిరులెల్లా చేకొనుట
“మేకుల “ శ్రీహరి నామమే నొరనుడుగుట, కైకొన్న అమృతపు కందువగుట “
లక్ష్మీపతి ఐన వేంకటేశ్వరుని పూజించితే, సంపదలకేమి కొరత?
సూర్యవంశి ఐన శ్రీ హరి నామజపమే “ అమృత పానము గాదా ?
పల్లవి : “ ఇంతే మరి ఏమియు లేదు, యిందు మీదను
దొంతుల కర్మాలు దుమ్ము దూరుపెత్తుట “. (398, సంపుటం 1)
అన్ని సంచిత పాపాలను దుమ్ము దులిపినట్లు తీసి పారేసేది , “ శ్రీహరి నామ జపం “. అని
భావం.

తెలుగు అన్నమయ్య