15వ శతాబ్దిలో , శ్రీ అన్నమాచార్య కాలంలో కూడా , ప్రస్తుతం మనమందరం అనుభవిస్తున్న “లాక్డౌన్ ” లాంటి పరిస్థితియే వచ్చిందని, ఈ క్రింది సంకీర్తనలో చెప్పబడియున్నది ..... లొక్డౌన్ అంటే నిర్బంధమ్ . ఒక్క నిర్బంధమే కాదు, మొత్తం తిరుపతిలో నిశ్శబ్దం కూడా పాటించబడిందట.
శ్రీ వేంకటేశ్వరుని గుడికి తాళం వేసి , సీలు వేసి చాలా రోజులు మూసి వుంచారట. పేనిన తాళ్లతో ద్వారాన్ని కట్టి బిగించినట్లు ఈ సంకీర్తనలో అన్నమయ్య చెప్పారు. ( 15వ సంపుటం118 సంకీర్తన )
“ ఓ హోహో యనరో పారి , సాహసాన తిరుగరో జంట పారి “
“కోనేటిరాయడు కోరి నిద్రించీ వాడే , ఆనకమై జాలీయరో అండు బారీ ,
పేనిపట్టి వాకిళ్ళ బీగముద్ర లాయ నిడి , కానిమ్మని వాయించరో గంటపారీ “.
“”అంటే , సీలు వేసి , చాలా రోజులు గుడిని మూసి వేయడం జరిగినది, కారణం ఏంటి? ? ఆ శ్రీనివాసుడు నిద్ర కోరుతున్నాడట .
“ శ్రీవేంకటేశ్వరుడు. చిత్తగించీ లోననదే , కోవరమెన్నికరో కోటి పారి
ఆవల బంగారు గుదియలు ఘల్లు రనగ , తావు హనుమంతుని తలారి పారి “ ".
ఎదో ఒక విషమ పరిస్థితి, ఒక విషపూరిత వాతావరణం , జనానికి ఆపదకలిగించేది ఏర్పడివుండివుంటుంది. బయట జనంతో కలిసి తిరగడం ఒక ప్రమాదకారణమైన పరిస్థితి , తయారై ఉండిఉండవచ్చుఁగాబోలు! అందుకే, అన్నమయ్య , తిరుపతి జనులనుద్దేశించి, ఈ సంకీర్తనద్వారా , అందరిని జాగరూకులై ఉండమని “హెచ్చ్చరిక “ చేస్తున్నారు.
ఇది ఆధునిక కాలం, అది అన్నమయ్య కాలం .
ఆధ్యాత్మికత అంతస్థులలోనున్న కాలం. కాలాలు వేరే కావచ్చ్చేమో గానీ, గమనికలు - జాగ్రత్తలు , అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే.
కవులు గాయకులూ , ఆధ్యాతిక వేత్తలూ , అపార భక్తులున్న ఆ రోజుల్లో నేయినా , ఈ రోజుల్లోనైనా , అవే నిబంధనలూ, నిర్బంధాలూ . చరిత్రలో నిలిచిపోయే నిజాలివి
ఓహోహో అనరో పారి , సాహసాన తిరుగరో జంట పారి"
No comments:
Post a Comment