అన్నమయ్య , రెండే పదాలతో ఎంత పేద్ద అంతరిక్ష విజ్ఞాన ఘటన ను వివరించారో చూడండి.
ఆయన మొత్తం విజ్ఞానాన్ని ఒక చిన్న తిత్తిలో దాచేయగలిగిన అఖుంథిత ఆంధ్రభాషా పరిజ్ఞాని.
ఆయన మొత్తం విజ్ఞానాన్ని ఒక చిన్న తిత్తిలో దాచేయగలిగిన అఖుంథిత ఆంధ్రభాషా పరిజ్ఞాని.
ఒకటవ సంపుటంలో 468 సంకీర్తనలో , “ మూడు లోకములొక్కటఁ “ముంచి పెరిగినది “ అని ఒక విశేష తెలుగు ప్రయోగం చేశారు, అన్నమయ్య.
ముంచడమేమిటి ? పెరగడమేమిటి? . ముంచబడినవి మూడులోకములు , తిరిగి పెరిగినవీ మూడులోకములే. ముంచడం ఒక లోతుగల చోటే జరుగుతుంది. కనుక, ఆ మూడులోకములు వినాశమై మునిగిన చోటు , ఒక “కుండ “ ను పోలివున్నది. అందుండే, ఆ “సంజీవి “ లాంటి “విష్ణు శక్తియుతకాంతి “ నుండే , మళ్ళీ త్రిలోకాలు ఆవిర్భవించడం జరిగిందట.
అంటే, ఒక అద్భుత మైన , అసాధారణమైన, అనూహ్యమైన, అఖండ సంఘటన అంతరిక్షఅంతరాళాలలో , ఎప్పుడో, ఎక్కడో, జరిగితే , ఆ విషయాన్ని , అన్నమయ్య రెండే రెండు ముక్కలలో ముచ్చ్చటగా చేప్పేశారు.
అన్నమయ్య సాహితీ ప్రతిభ అద్భుతం, అమేయం .
అన్నమయ్య తెలుగు
No comments:
Post a Comment