Tuesday, July 28, 2020

తిరుపతిలో నిశ్శబ్దం, కొరోనాలాంటి నిర్బంధం

15వ శతాబ్దిలో , శ్రీ అన్నమాచార్య  కాలంలో కూడా , ప్రస్తుతం మనమందరం  అనుభవిస్తున్న  “లాక్డౌన్ ” లాంటి  పరిస్థితియే  వచ్చిందని, ఈ క్రింది సంకీర్తనలో  చెప్పబడియున్నది .....   లొక్డౌన్  అంటే  నిర్బంధమ్ . ఒక్క నిర్బంధమే  కాదు, మొత్తం తిరుపతిలో  నిశ్శబ్దం కూడా  పాటించబడిందట.

శ్రీ వేంకటేశ్వరుని గుడికి తాళం వేసి , సీలు వేసి చాలా రోజులు మూసి వుంచారట.  పేనిన తాళ్లతో  ద్వారాన్ని కట్టి బిగించినట్లు ఈ సంకీర్తనలో  అన్నమయ్య చెప్పారు. ( 15వ సంపుటం118 సంకీర్తన )

“ ఓ హోహో  యనరో  పారి , సాహసాన  తిరుగరో  జంట పారి “

“కోనేటిరాయడు  కోరి  నిద్రించీ  వాడే , ఆనకమై  జాలీయరో  అండు బారీ ,

పేనిపట్టి  వాకిళ్ళ  బీగముద్ర లాయ నిడి , కానిమ్మని  వాయించరో  గంటపారీ “.  


  “”అంటే , సీలు వేసి , చాలా రోజులు  గుడిని  మూసి వేయడం జరిగినది, కారణం     ఏంటి? ? ఆ శ్రీనివాసుడు  నిద్ర  కోరుతున్నాడట . 

     “ శ్రీవేంకటేశ్వరుడు.  చిత్తగించీ  లోననదే , కోవరమెన్నికరో  కోటి  పారి 
 ఆవల   బంగారు  గుదియలు  ఘల్లు  రనగ , తావు హనుమంతుని  తలారి  పారి “  ".      
    
ఎదో ఒక  విషమ పరిస్థితి, ఒక విషపూరిత వాతావరణం , జనానికి ఆపదకలిగించేది  ఏర్పడివుండివుంటుంది.  బయట జనంతో  కలిసి  తిరగడం  ఒక ప్రమాదకారణమైన  పరిస్థితి  , తయారై  ఉండిఉండవచ్చుఁగాబోలు!  అందుకే,    అన్నమయ్య  , తిరుపతి  జనులనుద్దేశించి,  ఈ  సంకీర్తనద్వారా  , అందరిని  జాగరూకులై  ఉండమని  “హెచ్చ్చరిక   “  చేస్తున్నారు.    

ఇది ఆధునిక  కాలం,  అది  అన్నమయ్య కాలం . 

ఆధ్యాత్మికత  అంతస్థులలోనున్న కాలం. కాలాలు  వేరే  కావచ్చ్చేమో  గానీ, గమనికలు - జాగ్రత్తలు , అప్పుడూ ఇప్పుడూ  ఒక్కటే.       

   కవులు గాయకులూ , ఆధ్యాతిక వేత్తలూ , అపార భక్తులున్న  ఆ     రోజుల్లో  నేయినా , ఈ రోజుల్లోనైనా , అవే  నిబంధనలూ,    నిర్బంధాలూ . చరిత్రలో  నిలిచిపోయే  నిజాలివి   

                                                                                                                                              
ఓహోహో అనరో  పారి , సాహసాన తిరుగరో  జంట పారి"

ధైర్యముంటే , బయట తిరగండి. అదీ , విడివిడిగా, కానీ , జంటగా కాదు.

         “ కోనేటి రాయడు కోరి నిదురించీ వాడే, ఆనక మై  జాలీయారో  అందు బారి   

       పేనిపెట్టి   వాకిళ్ళ  బీగ ముద్రలాయనిడి , కానిమ్మని  వాయించరో  గంట  పార

          “ తిరుపణి  మడగెను , తిరుగరాదెవ్వరికి , మరల నెలుగియ్యరో  మగపారి    పరగ  దేవతలెల్లా  బడకెళ మున్నారు , ఇరవాయ  సూర్యచంద్రు లెదురు  పారి      

  తిరుపతి మొత్తం  నిశ్శబ్దాన్ని  పాటించింది.   దేవతలూ విశ్రాంతి లోనున్నారు .  సూర్యుడు  చంద్రుడు  ఎదురెదురుగా  నిలిచినట్టి , ఒకానొక  గ్రహణ గ్రహ స్థితి ,   గోచరించింది. అది ఏలాంటి పరిస్థితి?ఎంత  విషమ పరిస్థితి  అవ్వకుంటే, ప్రజలు    ఇంటిలోనే , ఉండిపోవలసి వచ్చిందట . ఎవ్వరూ  బయట తిరురాదన్న  ఒక నిర్బంధస్థితి  తప్పనిసరి  అయ్యింది . ప్రతుతం , మనముంటున్న పరిస్థితియే. 

 అందరి  కోరికలు  ఆ వేంకటేశుడు , లోనుండి యే  తప్పక  వింటున్నాడు,  కావున , కోటి కోరికలైనా కోవెల వాకిటనే  నిలిచి , కోరుకొమ్మంటున్నారు. కోరిన కోర్కెల కొంగుపైడి  ఐన కోనేటి రాయడు, నిద్రించ కోరాడట . అందుకే ఆ నిశ్శబ్దం,  నిర్బంధం తిరుపతి  పాటించింది  .. ఇలాంటి  పరిస్థితులలో  , ఎవ్వరైనా  ఉఫ్  అంటారేగాని, ఓహోహో  అని అంటారేగానీ ,,అహహా  అని అనరుగదా!!!

 

  

Sunday, November 4, 2018

ముంచి పెరిగినది

అన్నమయ్య ,  రెండే  పదాలతో  ఎంత పేద్ద  అంతరిక్ష విజ్ఞాన ఘటన ను  వివరించారో  చూడండి.
ఆయన మొత్తం  విజ్ఞానాన్ని  ఒక చిన్న  తిత్తిలో దాచేయగలిగిన  అఖుంథిత  ఆంధ్రభాషా పరిజ్ఞాని.
 

ఒకటవ  సంపుటంలో 468 సంకీర్తనలో , “    మూడు లోకములొక్కటఁ “ముంచి పెరిగినది “ అని ఒక విశేష తెలుగు ప్రయోగం చేశారు, అన్నమయ్య. 

ముంచడమేమిటి ? పెరగడమేమిటి? .    ముంచబడినవి  మూడులోకములు , తిరిగి  పెరిగినవీ  మూడులోకములే.   ముంచడం ఒక లోతుగల చోటే  జరుగుతుంది.   కనుక,  ఆ మూడులోకములు  వినాశమై మునిగిన చోటు , ఒక  “కుండ “ ను పోలివున్నది.  అందుండే,  ఆ   “సంజీవి “ లాంటి  “విష్ణు శక్తియుతకాంతి “ నుండే , మళ్ళీ త్రిలోకాలు  ఆవిర్భవించడం జరిగిందట. 

అంటే,    ఒక అద్భుత మైన , అసాధారణమైన,  అనూహ్యమైన, అఖండ సంఘటన అంతరిక్షఅంతరాళాలలో , ఎప్పుడో, ఎక్కడో,  జరిగితే , ఆ విషయాన్ని ,  అన్నమయ్య  రెండే రెండు ముక్కలలో ముచ్చ్చటగా చేప్పేశారు. 

అన్నమయ్య  సాహితీ ప్రతిభ  అద్భుతం, అమేయం . 


                          అన్నమయ్య తెలుగు 

Tuesday, October 2, 2018

మేకుల హరి

  అన్నమయ్య  ప్రాస ప్రయాసలతో  సృష్టించబడ్డ  సరికొత్త  అఛ్చతెలుగు  పదాలు  అనేకాలు.
“ఎక్కువ, తక్కువలు” అనేదానికి  బదులు  “ హెచ్చు కుందులు “
“ అవును కాదు “  అనేదానికి  బదులుగా  “ అవు  కాము “
వెలుగు “  అనేదానికి బదులుగా  “ పగటు “. అని , ఎన్నో సందర్భానికి తగ్గట్లు  ఫిట్టింగ్ ఇస్తారు  అన్నమయ్య.  ఆయన సాహితీ సౌభాగ్యమంతా ఇంతా గాదు .  ఎక్కడ ఏ పదప్రయోగము  సమంజసమో,అక్కడ ఆ  పదము వాడి, భావార్ధము  పెల్లుబికించగల  అన్నమయ్య  తెలుగుభాషా  శిల్పకళా సౌలభ్యమునకు , యింకెవ్వరూ పోటీ  నిలవలేరు.

అన్నమయ్య,  “హరి “  సూర్య వంశజుడు , అనేందుకు బదులు,  “” మేకుల  శ్రీ హరి “ అని అంటారు.
సూర్యుని , ఒకే ఒక్క అక్షరంతో   “ మే “  అని సంబోధించారు.

           “ శ్రీ కాంతుడైనట్టి  శ్రీ వేంకటేశ్వరుని చేకొంటే  సిరులెల్లా  చేకొనుట
                 “మేకుల “  శ్రీహరి నామమే నొరనుడుగుట, కైకొన్న  అమృతపు  కందువగుట “
లక్ష్మీపతి  ఐన  వేంకటేశ్వరుని  పూజించితే,  సంపదలకేమి కొరత?
సూర్యవంశి ఐన  శ్రీ హరి నామజపమే  “ అమృత పానము గాదా ?

 పల్లవి :              “ ఇంతే  మరి ఏమియు  లేదు, యిందు  మీదను
                                     దొంతుల  కర్మాలు  దుమ్ము  దూరుపెత్తుట “.               (398, సంపుటం 1)

అన్ని  సంచిత పాపాలను  దుమ్ము దులిపినట్లు తీసి  పారేసేది ,  “ శ్రీహరి నామ జపం “. అని      
  భావం.          

                      తెలుగు అన్నమయ్య 

Wednesday, September 19, 2018

అన్నమయ్య తెలుగు

అన్నమయ్య అచ్చ తెలుగువాడు.  ఆనాటి తెలుగు, చాలా చాలా చక్కని అచ్చ తెలుగు, అది, 14వ శతాబ్ధి తెలుగు.  తెలుభాష స్వచ్చత , తెలుగు తియ్యదనం ఉట్టిపడేలా పదకవితతో సంకీర్తన  పరమాన్నం చేసిపెట్టి,  తెలుగు తల్లికి  నైవేద్యం చేసిన , “ పాదకవితాపితామహుడు “ శ్రీ శ్రీ అన్నమయ్య.
తక్కువ పదాలతో  ఎక్కువ భావాన్ని వ్యక్తం చేయడంలో అన్నమయ్యకు అన్నమయే సాటి.
అం తేకాదు,  సందర్భానికి కావలసినట్టులు కొత్త కొత్త పదాలను సృష్టించి, నప్పింప చేసే ఆయన భాషాదిపత్యం ఆయనకే తగు. యతి ప్రయాసలు, తన ఉఛ్వాసనిశ్వాసాలు.  పదపొంకాలు, పద అనునయాలు.  చరణ గతులు ,  తన.   పాద చరణవిన్యాసాలు.
“ అన్నమయ్య సంకీర్తనలు తెలుగువారికి పిండివంటలు.”
అన్నమయ్య పదాలు, తెలుగువారికి వినోదాలు. ఆయన మనకందించిన తెలుగు విందు ఆరగించి
ఆనందించుదాం. సాహిత్యం వినోదమైతే, సంస్కారం ఆభరణమౌతుంది.
అన్నమయ్య తెలుగు వికృతిశాబ్దాలను అమితంగా వాడి సలరింపచేశారు, సంకీర్తనలను.
తెలుగు సాహిత్యాన్ని  యీ రీతిగ వినోదప్రదంగా, సంకీర్తనల రూపంలో ఆరగింపుచేసిన అన్నమయ్యకు శతకోటి ప్రణామాలు.
                             
అన్నమయ్య  తన సంకీర్తనలలో ఎన్నో క్రొత్త క్రొత్త పదాలను, సందర్భానుగుణంగా  సృష్టించి, చెప్పాలనుకున్న విషయాన్ని, ఎంతో భావభరితంగా చేశారు. సామెతలు, ఉపమానాలు, నుడికారాలు, విరుద్ద్ద జంటప్రయోగాలు, మొదలుగా గల అనేక భాషా ప్రయోగాలతూ పాటలను పండించారు.      
అన్నమయ్య తన సంకీర్తనలలో, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ప్రభోదాత్మక, తాత్విక, భక్తియుత, సందేశాత్మక,
జానపదాత్మక, వైజ్ఞానిక, జ్ఞానాత్మక, సందర్భాత్మక విషయాలు కుప్పించి , మనోరంజకంగా పాడే తీరులో , అదీ అందరు పాడేతీరులో మనకు అందించారు. ఒక్క తెలుగు సాహిత్యంతో  ఇంత జ్ఞాన వైవిధ్యాన్ని ప్రపంచానికి అందించే శక్తి , సామాన్యులకు సాధ్యంకాదు.  అన్నమయ్య దైవీకశక్తి గల మహా కవి గాయక సంగీత సార్వభౌముడు. కనుకే , వేవేల కీర్తనలు అలా అలా అలా అలవోకగా వ్రాసేసారు.
ఆయన “ విష్ణు అన్నమయ్య “

వికృతి పద ప్రయోగాలతో విచిత్ర శోభనుడిగించి, మనస్సును భావభరితం చేసే సాహసం అతనికే చెల్లు.

భక్తి “ బదులు  “బత్తి “ అని,  “నిత్యము “బదులు “నిచ్చ్చ “అని,” ముత్యము “బదులు “ముత్తెము “,
“సత్యము “బదులు “ సత్తెము “, ఇలాగ ప్రకృతి పాదాల చోటిలో వికృతులు వాడి , పాటకు ఒక క్రొత్త  సింగారాన్ని చేగూర్చారు అన్నమయ్య.
తెలుసు సామెతలు ,  కరకరలాడించి  యతిప్రాసలతో మేళవించి,  పద  గతులతో  జతులు నడిపిన  మహా
సంగీతజ్ఞుడు  శ్రీ అన్నమయ్య.
       “ అన్నమయ్య తెలుగు , ఆ పరమాత్మ  వెలుగు. “

                                  తెలుగు   అన్నమయ్య







                             
                                 

తిరుపతిలో నిశ్శబ్దం, కొరోనాలాంటి నిర్బంధం

15వ శతాబ్దిలో , శ్రీ అన్నమాచార్య  కాలంలో కూడా , ప్రస్తుతం మనమందరం  అనుభవిస్తున్న  “లాక్డౌన్ ” లాంటి  పరిస్థితియే  వచ్చిందని, ఈ క్రింది సంక...